ప్రగతికి బాటలు పడేనా ? | - | Sakshi
Sakshi News home page

ప్రగతికి బాటలు పడేనా ?

Published Wed, Mar 12 2025 8:19 AM | Last Updated on Wed, Mar 12 2025 8:14 AM

ప్రగత

ప్రగతికి బాటలు పడేనా ?

వాతావరణ ం
జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి తీవ్రమవుతుంది.

బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025

పారిశ్రామిక రంగంలో..

పాల్వంచ కేటీపీఎస్‌లో కొత్తగా 400 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. అక్కడ టీజీ జెన్కో ఆధ్వర్యంలో కొత్త యూనిట్‌ ప్రారంభించాలనే డిమాండ్‌ ఉంది. అలాగే ఏపీ స్టీల్స్‌, స్పాంజ్‌ ఐరన్‌ స్థలాలను సెమీ కండక్టర్ల తయారీ వంటి న్యూఏజ్‌ పరిశ్రమలకు కేటాయించేలా విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. దీంతో పాటు కొత్తగూడెంలో మూతబడిన బేరియం ఫ్యాక్టరీ, కిన్నెర స్టీల్స్‌ తదితర పరిశ్రమల స్థలాలు సైతం నిరూయోగంగా ఉన్నాయి. వీటిని ఎలా వినియోగంలోకి తేవాలనే అంశాలపై దృష్టి సారించాలి. జిల్లాలో ఇప్పటికే పత్తి విరివిగా సాగవుతుండగా కొత్తగా వరి, పామాయిల్‌ సాగు పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రైస్‌ మిల్లుల వంటి అనుబంధ పరిశమ్రలు ప్రైవేట్‌, గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో వచ్చేలా ఈ బడ్జెట్‌లో ప్రోత్సహకాలు అందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

యూనివర్సిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు..

జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ మొబైల్‌ నెట్‌వర్క్‌ సౌకర్యం కలించాల్సిన అవసరముంది. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం, అందుకోసం అటవీ శాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని అసెంబ్లీలో గొంతు విప్పేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇప్పటికీ యూనివర్సిటీ లేదు. కొత్తగూడెంలో ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై ఈ బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం వస్తుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

‘సీతారామ’తో న్యాయం దక్కేనా ?

ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా పేర్కొంటున్న సీతారామ ప్రాజెక్టుతో జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలకూ అంతంతమాత్రమే. దీంతో గోదావరి జలాలు జిల్లాలోని పొలాల్లో ప్రవహించేలా అనుబంధ పథకాలు కావాలని జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు.

ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడుతా

నియోజకవర్గానికి కావాల్సిన కేటాయింపులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు అందించా. ప్రధానంగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు, కార్పొరేషన్‌ ఏర్పాటు, హరిత హోటల్‌ వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తా. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ సర్కార్‌ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నా. బడ్జెట్‌లోని అంశాలను పరిశీలించాక స్పష్టమైన అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెబుతా.

– కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే

విద్య, వైద్యంపై ఫోకస్‌

అన్నపురెడ్డిపల్లిలో 100 పండకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతా. యంగ్‌ ఇండియా స్కూల్‌కు భూమి గుర్తించినందున నిధులు మంజూరు చేయాలని అడుగుతా. అశ్వారావుపేట మున్సిపల్‌ భవనం నిర్మాణానికి, మూకమామిడి, వెంగళరాయసాగర్‌, గుమ్మడవెల్లి మధ్య తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.

– జారే ఆదినారాయణ,

అశ్వారావుపేట ఎమ్మెల్యే

ఎత్తిపోతలకు నిధులపై

మాట్లాడుతా

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రగళ్లపల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. దీని వల్ల 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతుంది. అన్ని గ్రామాలకూ తాగునీరు అందించడంతో పాటు విద్య, వైద్య రంగాల్లో సేవల విస్తరణకు తగిన నిధులు కావాలని అడుగుతా.

– తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

అటవీ అనుమతులపై ప్రస్తావిస్తా

ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు ఇప్పించే అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఏజెన్సీ గ్రామాల్లో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేలా నిధులు కేటాయించాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి గరిష్ట స్థాయిలో మేలు చేయాల్సిన అవసరంపై మాట్లాడుతా.

– పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే

కాలేజీలు కావాలి

ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాల, నర్సింగ్‌ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతా. నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీటిని తరలించాలని డిమాండ్‌ చేస్తా. ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌, కొమురారం, బోడు మండలాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తా.

– కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే

భక్తుల కొంగుబంగారం..

అన్నపురెడ్డిపల్లి శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. .

8లో

న్యూస్‌రీల్‌

ఎకో – టెంపుల్‌ టూరిజం..

పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న జిల్లా

ఎకో – టెంపుల్‌ టూరిజంలో అవకాశాలు

ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీపై గంపెడాశలు

సీతారామ ద్వారా జిల్లాకు న్యాయం దక్కేనా..

అసెంబ్లీలో వాణి వినిపించనున్న ఎమ్మెల్యేలు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌.. జిల్లా ప్రగతికి అన్ని విధాలా బాటలు వేయాలని పలువురు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోరుతూ రాష్ట్ర సర్కారుకు నివేదికలు సమర్పించారు. ఇక అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి, కిన్నెరసాని అభయారణ్యం, కనకగరిగి గుట్టలు, మోతెగడ్డ వంటివి ఎకో – టెంపుల్‌ టూరిజానికి అనువుగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన టూరిజం పాలసీలో వీటికి చోటు కూడా దక్కింది. దీనికి కొనసాగింపుగా ఈ బడ్జెట్‌లో ఎకో – టెంపుల్‌ టూరిజానికి నిధులు మంజూరైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా హోం స్టే విధానాలకు ప్రోత్సాహకాలు దక్కితే ఇంకా బాగుంటుంది. గతంలో ప్రతిపాదన దశలో ఉన్న భద్రకాళి – భద్రాచలం సర్క్యూట్‌లో భాగంగా మణుగూరు దగ్గరున్న రథం గుట్టలు – వెన్నెల జలపాతం వద్ద అభివృద్ధికి అవకాశం కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రగతికి బాటలు పడేనా ?1
1/6

ప్రగతికి బాటలు పడేనా ?

ప్రగతికి బాటలు పడేనా ?2
2/6

ప్రగతికి బాటలు పడేనా ?

ప్రగతికి బాటలు పడేనా ?3
3/6

ప్రగతికి బాటలు పడేనా ?

ప్రగతికి బాటలు పడేనా ?4
4/6

ప్రగతికి బాటలు పడేనా ?

ప్రగతికి బాటలు పడేనా ?5
5/6

ప్రగతికి బాటలు పడేనా ?

ప్రగతికి బాటలు పడేనా ?6
6/6

ప్రగతికి బాటలు పడేనా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement