14న ఫాల్గుణ పౌర్ణమి వేడుకలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామయ్య పెళ్లి పనులకు ఆరోజే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పసుపు దంచి తలంబ్రాలు కలిపే వేడుక ప్రారంభం అవుతుందని, అనంతరం వసంతోత్సవం, డోలోత్సవం ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. భద్రాచలం దివ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్ణశాలలోనూ ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ వ్యక్తులు ప్రసాదాలు విక్రయించొద్దు..
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు, తోపుడు బండ్ల వారు, ఇతరులు ప్రసాదాల పేరుతో లడ్డూలు, పులిహోర విక్రయించడాన్ని నిషేధించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామయ్య పెళ్లి పనులకు ఆ రోజే శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment