పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
చండ్రుగొండ : చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ మంగళవారం సందర్శించారు. ‘పీహెచ్‌సీలో చెట్లు దగ్ధం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆస్పత్రిని సందర్శించి డాక్టర్ తనుజ, సిబ్బందితో మాట్లాడి చెట్ల దగ్ధమైన సంఘటనపై ఆరా తీశారు. కాలిపోయిన ప్రదేశాన్ని శుభ్రం చేయించి కొత్తగా మొక్కలు నాటించాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీని, రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత ఎర్రగుంట పీహెచ్‌సీని సందర్శించి అసంక్రమిత వ్యాధులపై సర్వే పక్కాగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ ప్రియాంక, డీపీఎంఓ శ్రీనివాస్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment