పశువులు తరలిస్తున్న వ్యాన్ పట్టివేత
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా పశువులను కబేళాకు తరలిస్తుండగా సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా అలమంద సంత మార్కెట్‌లో కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే 8 ఆవులు, 4 ఎద్దులను వ్యాన్‌లో హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి స్థానిక రింగ్ రోడ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌ను సీజ్ చేసి, మూగజీవాలను పాల్వంచలోని గోశాలకు తరలించారు. వ్యాన్ యజమాని, డ్రైవరు ఓర్సు శ్రీను, క్లీనర్ అల్లపు వెంకటేశ్, దళారీ మానేపాటి ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment