ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
పాల్వంచరూరల్: పాలకులు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి సమీపంలొ బుధవారం నిర్వహించిన రైతు సంఘం జిల్లాస్థాయి జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులను, వ్యవసాయరంగాన్ని కాపాడాలని కోరారు. వ్యవసాయరంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు బలంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, గత ప్రభుత్వం ఎత్తేసిన వ్యవసాయ యంత్రాల సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్‌పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, అధ్యక్షుడు చంద్ర నరేంద్రకుమార్, నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, నరాటి ప్రసాద్, శ్రీనివాస్, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, అడుసుమల్లి సాయిబాబా, దస్రూ, హన్మంతరావు, బండి నాగేశ్వరరావు, ఉప్పశెట్టి రాహుల్, సుధాకర్, యూసుఫ్, రమేష్, లక్ష్మి, బిక్షం, కొంగర అప్పారావు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంఘం
అధ్యక్షుడు హేమంతరావు
Comments
Please login to add a commentAdd a comment