తొమ్మిదో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన
టేకులపల్లి: విద్యార్థినిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ వార్డెన్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం చితకబాదారు. మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ (హిందీ టీచర్) మాలోత్ ప్రతాప్‌సింగ్ మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల ఆవరణలో తొమ్మిదో తరగతి బాలికపై చేతులు వేసి అసభ్య పదాలు మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేశాడు. బాలిక ప్రతిఘటించి డిప్యూటీ వార్డెన్‌ను నెట్టివేసింది. అదే సమయంలో వంట చెరకు డబ్బుల కోసం వచ్చిన గ్రామస్తులకు బాలిక ఏడ్చుకుంటూ విషయం తెలిపింది. దీంతో వారు ప్రశ్నించగా తప్పయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గ్రామస్తులు విషయం తెలపడంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, బంధువులు రాత్రి పాఠశాలకు రాగా, డిప్యూటీ వార్డెన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో బుధవారం మళ్లీ సుమారు వంద మందికి పైగా పాఠశాలకు చేరుకుని డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎంలను నిలదీశారు. డిప్యూటీ వార్డెన్ పశ్చాత్తాపం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చితకబాదారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్, డిప్యూటీ తహసిల్దార్ ముత్తయ్య, ఏటీడీవో రాధ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక, తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో డిప్యూటీ వార్డెన్‌పై హెచ్‌ఎం జగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి, కోరిక తీర్చాలని బాలికను బలవంతం చేయబోయిన డిప్యూటీ వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న బోడు పోలీసులకు బైక్‌పై వెళ్తున్న డిప్యూటీ వార్డెన్ తారస పడటంతో అదుపులోకి తీసుకుని బోడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
డిప్యూటీ వార్డెన్‌ను చితకబాదిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment