వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా శాంతికుమార్
మణుగూరు రూరల్: వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా మణుగూరు ప్రాంతానికి చెందిన పప్పుల శాంతికుమార్ ఎంపికయ్యాడు. ఆయన ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహనకు శిక్షణ పొందగా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ నేపథ్యాన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు, అరికట్టడంపై ఇచ్చిన శిక్షణకు రాష్ట్రం నుంచి వంద మంది ఎంపికవగా శాంతికుమార్‌కు జాబితాలో చోటు దక్కింది. ఇటీవల శిక్షణ పూర్తయిన అనంతరం హైదరాబాద్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.
వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా శాంతికుమార్