ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కొత్తగా వాహనం కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. వినియోగదారుల కోరిక మేరకు కంపెనీలు తక్కువ ధరకు మంచి స్కూటర్లు, కార్లను మార్కెట్లోకి తీసుకొనివస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దం అవుతుంది. నోయిడాకు చెందిన కంపెనీ ఏఎమ్ఓ మొబిలిటీ ఇప్పుడు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్దం అవుతున్నట్లు ఎఎమ్ఓ ఎలక్ట్రిక్ బైక్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశాంత్ కుమార్ పేర్కొన్నారు.
కొత్తగా మార్కెట్లోకి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు జాంటీ. కంపెనీ మరో రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియెంట్లు తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఈ జాంటీ ప్లస్ స్కూటర్ వచ్చే నెలలో చూస్తున్నట్లు సమాచారం. ఇది పనితీరు పరంగా సంప్రదాయ 125సీసీ స్కూటర్ తో సరిసమానంగా పనిచేయనున్నట్లు సుశాంత్ కుమార్ తెలిపారు. ఇది లిథియం-అయాన్ బ్యాటరీలతో పనిచేయనుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే ఇది 100 కిలో మీటర్ల వరకు వెళ్లనుంది. ఈ స్కూటర్ బ్యాటరీని చార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే, రెండు గంటల్లోనే దీని బ్యాటరీ 60 శాతం వరకు చార్జ్ అవుతుంది. దీని ధర రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
(చదవండి: రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ 4 కార్లు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment