సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల రేసులో ముందున్న ఆటోమొబైల్ సంస్థ ఏది అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది టెస్లా కార్లే..! ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అత్యంత ఆదరణను పొందాయి. కాగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయంలో ఎలన్‌మస్క్‌ను ట్యాగ్‌ను చేస్తూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు.
చిల్లి గవ్వ అవసరం లేదు..!
ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఎడ్ల బండి చిత్రాన్ని షేర్ చేశారు. చిల్లి గవ్వ అవసరం లేకుండా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యంతో ఇంకా గూగుల్ మ్యాప్స్ అవసరం లేకుండానే గమ్యస్థానాలకు చేర్చే ఒరిజినల్ టెస్లా వాహనం ఎద్దుల బండి అనే కాప్షన్ ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో టెస్లా చీఫ్ ఎలన్‌మస్క్‌ను ట్యాగ్ చేసి బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే 11 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కొంతమంది నెటిజన్లు టెస్లా కారుకు సవాలు విసిరే కారు ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే మాత్రమే అంటూ రాసుకొస్తున్నారు.
BACK to the Future… @elonmusk pic.twitter.com/csuzuF6m4t
— anand mahindra (@anandmahindra) April 24, 2022
ఇదిలా ఉండగా...గతంలో ఆనంద్ మహీంద్రా పునరుత్పాదక శక్తితో నడిచేకారు గురించి కూడా ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేయగా..అప్పుడు మస్క్ దానికి రిప్లై కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఎలాంటి రిప్లై ఇస్తారని ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు నెటిజన్లు.
చదవండి: ఆ విషయం గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో కూడా ఇలా చెప్పలేరు
Comments
Please login to add a commentAdd a comment