సంతోషం, బాధ, పండగలు, ప్రతిభలు ఇలా అంశం ఏదైనా సోషల్ మీడియా వేదికగా స్పందించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా.. భవిష్యత్తు పట్ల భరోసా కలిగించేలా ఓ వీడియోను షేర్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఓ ఆండియన్ కండోర్ పక్షికి రోజుల తరబడి చికిత్స అందించారు చిలీ వైద్యులు. ఆ తర్వాత ఆ పక్షిని జాగ్రత్తగా పర్వత ప్రాంతాలకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. కాసేపు ఎగిరేందుకు ఇబ్బంది పడ్డ ఆ పక్షి.. ఆ తర్వాత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ప్రకృతిలో మమేకమైంది.
Just one video captures all my hopes for the New Year.Sinchi, an Andean condor, was released in the Peruvian mountains after recovering from severe poisoning. Covid poisoned the world. May we find our collective wings in ‘22. Happy New Year to you all. pic.twitter.com/g7OEIfFDId
— anand mahindra (@anandmahindra) December 31, 2021
ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియో పాతదే అయితే ఆ వీడియోను ప్రస్తుత కరోనా పరిస్థితులకు ముడిపెట్టారు ఆనంద్ మహీంద్రా. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మన జీవితాలు అతలాకుతలం అయ్యాయని, రాబోయే ఏడాదిలో ఈ కష్టాలను జయించి హాయిగా స్వేచ్ఛగా జీవిద్దాం అనే అర్థం వచ్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment