
ఐఫోన్ షిప్‌మెంట్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. 2022లో 6.7 మిలియన్ల ఐఫోన్‌ల షిప్‌మెంట్ జరగ్గా.. ఈ ఏడాది అత్యధికంగా 8 నుంచి 9 మిలియన్ ఐఫోన్ షిప్‌మెంట్ జరిగే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది గడిచిన ఆరు నెలల కాలంలో 4 మిలియన్లకు పైగా ఐఫోన్ అమ్మకాలు రెట్టింపు అయినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్, ఐడీసీని ఉటంకిస్తూ.. 2023లో ఐఫోన్ షిప్‌మెంట్‌లు దాదాపు 8-9 మిలియన్లు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ తన మార్కెట్ వాటాను 6-7 శాతానికి చేరుకుంటుందని మార్కెట్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐఫోన్ 15 లాంచ్‌తో పాటు పండగలు, డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్లు సైతం ఐఫోన్ అమ్మకాలకు కలిసొచ్చే అవకాశం ఉంది. కాగా, జూన్ 30న యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సంవత్సరం జనవరి నుండి మొదటిసారిగా 3 ట్రిలియన్ మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment