
ముంబై: దలాల్‌స్ట్రేట్‌లో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సర్వేలో ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కొద్దిగా నిరుత్సాహపరిచిన అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, బడ్జెట్, అర్థిక సర్వే నివేదిక మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేయడంతో సూచీలు తిరిగి భారీ లాభాలను అందుకున్నాయి.
బడ్జెట్ రోజు ప్రధానంగా మెటల్, ఫార్మా & క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ మద్దతుతో సెన్సెక్స్ 848.40 పాయింట్లు(1.46%) పెరిగి 58862.57 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 237.00 పాయింట్లు (1.37%) పెరిగి 17576.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.80 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్ & హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా లాభపడితే.. బిపీసీఎల్, ఐఓసీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ షేర్లు అధికంగా నష్ట పోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపు రంగులో ముగియగా.. బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఐటి, రియాల్టీ, మెటల్ సూచీలు 1-5 శాతం పెరిగాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.
(చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!)