
ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. భారీగా పెట్రో ధరల పెంపుతో పాటు, టెక్నాలజీ తగ్గట్లు అప్‌డేట్ అవుతున్నారు. అందుకే వాహనాదారులు పెట్రో వాహనాల్ని పక్కనపెట్టి..ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థలకు కలిసొస్తున్న అంశమనే చెప్పుకోవాలి.
అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఛార్జింగ్ తప్పని సరి. కానీ దేశంలో ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు నామ మాత్రంగానే ఏర్పాటు చేశాయి. దీంతో వాహనదారులు ఈవీ వెహికల్స్ కొంటే ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఫేమ్ ఇండియా (Faster Adoption And Manufacturing Of Electric Vehicles) పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 70వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో 22వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే స్పందించారు. ఎక్స్‌ప్రెస్ హైవేస్, హైవేస్, నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైవేకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, దూరంతో పాటు భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ప్రతి 100కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, నగరాల్లోని గ్రిడ్ పరిధిల్లో ప్రతి 3కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తేవాలని విద్యుత్ శాఖ గైడ్‌లైన్స్ నిర్దేశించిందన్నారు.
లిథియం బ్యాటరీల కోసం
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కీలకమైన లిథియం బ్యాటరీల ఉత్పత్తి పరిశ్రమల్ని స్థాపించనున్నట్లు మహేంద్రనాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) కింద రూ.18,100 కోట్లు కేటాయించామని అన్నారు.
చదవండి: కార్ల కొనుగోలుపై లక్షకు పైగా భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా