
ముంబై: పండుగ తెల్లారి స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు స్వల్ప నష్టాలతో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు నెమ్మదిగా లాభాలవైపు అడుగులు వేస్తున్నాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఐటీతో పాటు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఆశజనకంగా ఉండటం మార్కెట్‌కి కలిసి వస్తుంది.
ఉదయం 9:50 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 61,197 వద్ద కొనసాగుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒక పాయింటు లాభపడి 18,257 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇప్పటి వరకు థర్డ్ వేవ్ భయాలు కొనసాగినా కేవలం రెండు వారాల్లోనే పెద్దగా ప్రాణనష్టం లేకుండా ముంబైలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుతుండంతో మార్కెట్‌కు బూస్ట్ ఇవ్వవచ్చని నిపుణుల అంచనా.