ముంబై: ప్రపంచ మార్కెట్ సూచీలను అనుసరించి దేశీ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో ఉంది. మార్కెట్ ఆరంభం కావడం మొదలు ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలు కిందికి దిగడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేపు పెంపు ఊహించినట్టుగానే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి పోతాయనే అంచనాలు తారుమారు అయ్యింది. మార్కెట్ చూపిస్తున్న జోరు ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ మరోసారి 57 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. మార్కెట్ ప్రారంభమైన 45 నిమిషాలకే 1.35 శాతం వృద్ధితో 57,576 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. 209 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధితో 17,184 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం కీలకమైన 17వేల మార్క్‌ని క్రాస్ చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు భారీ లాభాలు పొందగా సెన్సెక్స్ 30లో అన్ని అన్ని షేర్లు సానుకూలంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ షేర్లలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ మిడ్‌కాప్ ఇండెక్స్ 1.36 శాతం వృద్ధిని చూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment