ముంబై: ఓ వైపు చర్చలంటూ రష్యా చెబుతున్నా మరో వైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచ, ఏషియా మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీని ఎఫెక్ట్ దేశీ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 412 పాయింట్లు నష్టపోయి 52,430 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎనఎస్ఈ నిఫ్టీ 115 పాయింట్లు నష్టపోయి 15,747 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. చాలా షేర్లు కనిష్టాల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే చర్చల ఫలితాలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఆగితే.. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment