ముంబై: స్టాక్ మార్కెట్‌లో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఆగకపోయినా దేశీ సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. తక్కువ ధరల మధ్య కొనుగోళ్ల మద్దతుల లభించడానికి తోడు నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేసిన ప్రకటన మార్కెట్‌లో కొత్త ఆశలు నింపింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షలు విధించడంతో మార్కెట్ కుదేలవుతుందనే భావన నెలకొన్నా.. జెలన్‌స్కీ ప్రకటన మార్కెట్‌కు కొత్త ఊపిరి ఊదింది. ఫార్మా, ఐటీ షేర్లు అండతో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి.
ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 53,609 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 16,078 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, రెడ్డీస్ ల్యాబ్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెసీఎల్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, నెస్టల్ ఇండియా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ లాభాల్లో ఉండగా బ్యాంక్ నిఫ్టీ, మెటల్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment