Russia Ukraine War Impact On Stock Market: అనుకున్నట్టే అయ్యింది. నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశీ స్టాక్ మార్కెట్ బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి,.
ఉదయం 10 గంటల సమయానికి 1863 పాయింట్లు నష్టపోయి 55,368 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ మొదలైన నలభై నిమిషాల్లోనే 3.268 శాతం క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 582 పాయింట్లు నష్టపోయి 16,480 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇప్పటికే 3.41 శాతం క్షీణించింది. నవంబరు నుంచి కరెక‌్షన్ కొనసాగుతోంది. దీంతో ప్రతీ రెండు వారాలకు ఓసారి మార్కెట్ భారీగా నష్టపోవడం పరిపాటిగా మారింది. కానీ ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో కేవలం గంట వ్యవధిలోనే ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీలు ఏకంగా 3 శాతానికి పైగా క్షీణించాయి. ఇంత భారీ స్థాయిలో మార్కెట్లు పతనం కావడం ఈ ఏడాదిలో ఇదే మొదటి సారి.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుకు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్లకు తోడు దేశీ ఇన్వెస్టర్లు సైతం అమ్మకాలకు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే మార్కెట్లు మరింగా నష్టపోవడం ఖాయం. ఇప్పటికే మూడు నెలలుగా కొనసాగుతున్న కరెక్షన్, ఉక్రెయిన్ టెన్షన్‌తో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. తాజా యుద్ధంతో మరోసారి భారీ నష్టాలు తప్పవనే పరిస్థితి నెలకొంది. దీంతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందనే ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొంది. మార్కెట్‌ముగిసే సరికి పరిస్థితి మరింత దారుణంగా అవుతుందా ? ఏం జరుగుతుందనేది తేలియక ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment