ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | Detel Easy Plus electric bike launched in India | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

Published Sun, Mar 21 2021 4:58 PM | Last Updated on Sun, Mar 21 2021 5:07 PM

Detel Easy Plus electric bike launched in India - Sakshi

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డెటెల్ తన ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ రోజు రూ.41,999 (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది. ఈజీ ప్లస్‌ను టోకెన్ ద్వారా రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డిటెల్ ఈజీ ప్లస్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 100 శాతం ఛార్జ్ కావడానికి 4నుంచి 5 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్ ద్వారా ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని డిటెల్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లో పౌడర్-కోటెడ్, మెటల్ అల్లాయ్ బాడీ ఉంది. 

ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు. కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. వినియోగదారులు మెటాలిక్ ఎల్లో, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లాక్, గన్మెటల్, పెర్ల్ వైట్ రంగులను ఎంచుకోవచ్చు. 

చదవండి:

అలర్ట్: బ్యాంకులకు వరుస సెలవులు

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement