నోరూరించే బిర్యానీకి వరల్డ్ ఫేమస్ హైదరాబాద్. ఇక్కడ ఒక్క బిర్యానీనే కాదు రాయలసీమ రుచులు, పాలమూరు గ్రిల్స్, రాజుగారి వంటగది మొదలు వరల్డ్ ఫేమస్ క్యూజిన్ వంటకాలు భాగ్యనగరంలో లభిస్తాయి. వీటిని ఆరగించేందుకు రెస్టారెంట్లకు వెళ్లేవారు ఎక్కువ. దీంతో దేశంలో రెస్టారెంట్, హోటల్ బిజినెస్‌లో హైదరాబాద్ దూసుకుపోతుంది.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో ప్రతీ ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో రూ. 6,037 కోట్లు, చైన్ రెస్టారెంట్లలో రూ.1,380 కోట్లు ఉండగా మిగిలిన రెస్టారెంట్లలో రూ.4657 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు వెల్లడించింది. కేవలం ఎన్‌ఆర్‌ఏఐ వివరాల ప్రకారం ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న రెస్టారెంట్ల వ్యాపారం రికార్డు స్థాయిలో రూ.12,000 కోట్లకు ఇంచుమించుగా ఉంది.
రెస్టారెంట్ల వ్యాపార వ్యవహరాలకు సంబంధించి ఎన్‌ఆర్‌ఏఐను 1982లో ఏర్పాటు చేశారు. దేశం మొత్తం మీద అన్ని నగరాల్లో ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్లు ఈ అసోసియేషన్‌లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ చాప్టర్‌లో 200ల వరకు ఎన్‌ఆర్‌ఏఐలో అనుబంధం కలిగి ఉండగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఏఐను విస్తరించి ఈ అసోసియేషన్ పరిధిలోకి 2000ల రెస్టారెంట్లు, హోటళ్లు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కోవిడ్ ఆంక్షలు తలెత్తిన తర్వాత రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా నిబంధనలు రెస్టారెంట్లకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. అదే విధంగా ఫుడ్ ఇండస్ట్రీలోకి చొచ్చుకువస్తున్న ఈ కామర్స్‌కు సంబంధించి వ్యవహారాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసుల్లో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి మరింత సమర్థంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఎన్‌ఆర్‌ఏఐ అడుగులు వేస్తోంది.
చదవండి:ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
Comments
Please login to add a commentAdd a comment