Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు | Electric Vehicle On Indian Roads To Touch 5 Crores By 2030 Estimates Kpmg | Sakshi
Sakshi News home page

Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు

Published Wed, Aug 31 2022 4:57 AM | Last Updated on Wed, Aug 31 2022 7:45 AM

Electric Vehicle On Indian Roads To Touch 5 Crores By 2030 Estimates Kpmg - Sakshi

న్యూఢిల్లీ: భారత రహదారులపై ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు) 2030 నాటికి 5 కోట్లకు చేరుకుంటాయని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది. చార్జింగ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు చేసే సంస్థలకు అపార అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రస్తుతం మొత్తం వాహనాల్లో ఈవీల వాటా 1%గానే ఉన్నప్పటికీ.. డిమాండ్, సరఫరా, నియంత్రణ పరమైన సానుకూలతలు ఉన్నట్టు తెలిపింది. ‘ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ – తదుపరి భారీ అవకాశాలు’ పేరుతో కేపీఎంజీ ఓ నివేదిక విడుదల చేసింది.

‘దేశీ ఎలక్ట్రిక్‌ వాహన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈవీ ప్రధాన విభాగంగా అవతరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల విక్రయాలు 3 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.  2022 మార్చికి భారత రోడ్లపై ఈవీల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సంఖ్య 2030 నాటికి 4.5–5 కోట్లకు చేరుతుంది. ఇది చార్జింగ్‌ సదుపాయాలకు భారీ డిమాండ్‌ను తెస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,700 బహిరంగ చార్జింగ్‌ స్టేషన్ల వరకే అందుబాటులో ఉన్నాయి. ఈవీల వృద్ధికి ఈ సంఖ్య ఏ మాత్రం చాలదు’’అని కేపీఎంజీ నివేదిక తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement