ప్రపంచ దేశాలను రష్యా ఉక్రెయిన్ వార్ కలవరపెడుతోంది. ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఇప్పుడు ఎలన్‌మస్క్ కలను గల్లంతయ్యేలా చేసింది. ఎకో ఫ్రెండ్లీ వాహనాలను మరింత తక్కువ ధరలకు అందించే ఎలన్ మస్క్ ప్రయత్నాలకు ఈ యుద్దం గుదిబండలాగా మారింది.
భారీగా పెరిగిన ముడిసరుకుల ఖర్చులు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్‌తో సహా, పలు ఖనిజాలు ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కాగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మినరల్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు గ్రెగొరీ మిల్లర్ ప్రకారం... అంతర్జాతీయ మార్కెట్లలో నికెల్, లిథియం , ఇతర ఈవీ విడిభాగాల ధరలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎగుమతులకు అంతరాయం కలుగుతుందన్న భయాలు నికెల్ ధరలు 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యా సుమారు 7 శాతం నికెల్‌ను ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటితో పాటుగా అల్యూమినియం, పల్లాడియం వంటి ఖనిజాలను రష్యా ఎక్కువగా దిగుమతి చేస్తోంది.
ధరలపై ప్రభావం..!
రష్యా-ఉక్రెయిన్ వార్ టెస్లా కార్ల ధరల పెంపును గణనీయంగా ప్రభావితం చేయనుంది. తీవ్రమైన సరఫరా చైన్ కష్టాలతో డిసెంబరు 2020లో టెస్లాలో అతి తక్కువ ఖరీదైన మోడల్ 3 సెడాన్ ధరను 18 శాతం 44,990 డాలర్లకు పెంచాల్సి వచ్చింది. ఇది కాస్త తక్కువ ధరకు ఈవీ వాహనాలను అందించే ఎలన్ మస్క్ ప్రయత్నాలను పూర్తిగా గల్లంతు చేశాయి.
అప్పుడు చిప్ కొరత..ఇప్పుడేమో..!
కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తీవ్రమైన చిప్ కొరతతో సతమతమయ్యాయి. అందులో ముఖ్యంగా ఈవీ వాహనాల తయారీ కంపెనీలకు మరి ఎక్కువ నష్టాలను మిగిల్చాయి. ఇప్పడిప్పుడే చిప్ కొరత సంక్షోభం తీరే తరుణంలో రష్యా-ఉక్రెయిన్ వార్ ఆయా కంపెనీలకు పీడకల లాగా మారనుంది. అంతర్జాతీయంగా నికెల్ ధరలు భారీగా పెరగడంతో ఆయా ఈవీ వాహనాల కంపెనీలు ధరలను పెంచడం అనివార్యం కానుంది.
చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...!
Comments
Please login to add a commentAdd a comment