
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ దేశవ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత రూపంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
సీఎస్‌ఆర్ కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ, సామాజికాభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించామని పేర్కొంది. వాతావరణ మార్పుల సమస్యలకు దీర్ఘకాలం పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం పరిష్కారమని కంపెనీ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు.