డిసెంబర్ 20తో ముగిసిన వారంలో 8.478 బిలియన్ డాలర్లు డౌన్
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 20తో ముగిసిన వారంలో.. అంతక్రితం వారం (డిసెంబర్ 13) ముగింపుతో పోల్చితే 8.478 బిలియన్ డాలర్లు తగ్గి 644.391 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 13తో మగిసిన వారంలో కూడా నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి ఆరు నెలల కనిష్ట స్థాయి 652.869 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. డాలర్ మారకంలో రూపాయి స్థిరీకరణ కోసం ఆర్‌బీఐ డాలర్లను మార్కెట్‌లోకి పంప్ చేయడం, మారకద్రవ్య రీ వ్యాల్యూయేషన్లు దీనికి ప్రధాన కారణం. సెపె్టంబర్ చివరిలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్ గరిష్టం 704.885 బిలియన్ డాలర్లకు తాకిన సంగతి తెలిసిందే.
విదేశీ కరెన్సీ ఆస్తులు
యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీల విలువల పెరుగుదల, క్షీణత ప్రభావానికి లోనయ్యే మొత్తం విదేశీ కరెన్సీ అసెట్స్ (డాలర్లు) 6.014 బిలియన్ డాలర్లు తగ్గి, 556.562 బిలియన్ డాలర్లకు చేరాయి.
బంగారం నిల్వలు
విదేశీ మారకద్రవ్య నిల్వలో భాగమైన బంగారం నిల్వలు 2.33 బిలియన్ డాలర్లు తగ్గి 65.726 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద నిల్వల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు సంబంధించిన ఈ విభాగం విలువ 112 మిలియన్ డాలర్లు తగ్గి 17.885 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది.
ఐఎంఎఫ్ వద్ద నిల్వలు
ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిమాణం 23 మిలియన్ డాలర్లు తగ్గి, 4.217 బిలియన్ డాలర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment