యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ క్యాష్‌బ్యాక్‌..! | Get Top Offers On Apple Devices During Vijay Sales Apple Days Sale | Sakshi
Sakshi News home page

Apple Days sale: యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ క్యాష్‌బ్యాక్‌..!

Published Sat, Dec 25 2021 5:01 PM | Last Updated on Sat, Dec 25 2021 5:01 PM

Get Top Offers On Apple Devices During Vijay Sales Apple Days Sale - Sakshi

ప్రముఖ ఇండియన్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ దిగ్గజం విజయ్‌ సేల్స్‌ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. యాపిల్‌ డేస్‌ సేల్‌ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా యాపిల్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను విజయ్‌ సేల్స్‌ ప్రకటించింది. ఈ సేల్‌ డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనుంది. విజయ్‌ సేల్స్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో ఆఫర్స్‌ లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 10 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ను కొనుగోలుదారులకు సొంతం చేసుకోవచ్చును. 

విజయ్‌ సేల్‌ ఆఫర్‌లో అందిస్తోన్న మోడల్స్‌ ఇవే..! 
ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 , ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా మాక్‌ బుక్ ఎయిర్ (ఎమ్‌1), మ్యాక్‌బుక్ ప్రో (ఎమ్‌1), మ్యాక్‌బుక్ ప్రో (ఎమ్‌1 ప్రో) వాటితో పాటుగా ఐప్యాడ్‌ (2021), ఐప్యాడ్‌ ఎయిర్‌ 2020)పై కూడా తగ్గింపు ధరలు అందిస్తోంది. ఎయిర్‌పాడ్స్‌(3వ తరం), ఎయిర్‌పాడ్స్‌ ప్రో, ఎయిర్‌ పాడ్‌ మ్యాక్స్‌, హోమ్‌ పాడ్‌ మినీపై వర్తించనున్నాయి. ఆయా ఐఫోన్లపై రూ. 5000 వేల వరకు క్యాష్‌బ్యాక్‌, మ్యాక్‌ బుక్స్‌పై రూ. 10 వేల క్యాష్‌బ్యాక్‌, ఐపాడ్స్‌పై రూ. 4 వేల వరకు, యాపిల్‌ వాచ్స్‌పై రూ. 3 వేల వరకు, మ్యాగ్‌సేఫ్‌పై రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను విజయ్‌ సేల్‌ అందిస్తోంది. 

విజయ్‌ సేల్స్‌లో ఆయా మోడల్స్‌ ధరల వివరాలు

చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement