Flipkart Big Saving Days Sale: Apple Airpods Pro Available With Huge Discount on Flipkart - Sakshi
Sakshi News home page

Apple: ఎయిర్‌పాడ్స్‌పై భారీ తగ్గింపు...!

Published Tue, Jul 27 2021 7:24 PM | Last Updated on Wed, Jul 28 2021 9:06 AM

Apple Airpod Pro Deal With Huge Discount On Flipkart - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌ జూలై 25 నుంచి ప్రారంభమై జూలై 29తో ముగియనుంది. ప్రస్తుతం బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా ఆపిల్‌కు చెందిన ఎయిర్‌పాడ్‌ ప్రోపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఆపిల్‌ ఎయిర్‌పాడ్‌ ప్రో పై సుమారు రూ. 6,901 డిస్కౌంట్‌ను అందించనుంది.  

అంతేకాకుండా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,500 పొందవచ్చును.దీంతో ఎయిర్‌పాడ్‌ ప్రోపై సుమారు రూ. 8 వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.  ఆపిల్‌ ఎయిర్‌పాడ్‌ ప్రో అసలు ధర. రూ.24,900. ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో యాక్టివ్‌ నైస్‌ కాన్సిలేషన్‌తో పాటు పది రకాల ఆడియో కోర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఐపీఎక్స్‌4 సర్టిఫికేషన్‌ను కల్గి ఉంది. వాటితో పాటు  ఎయిర్‌పాడ్స్ ప్రోలో అడాప్టివ్ ఈక్వలైజర్‌తో వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement