హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఆగ్రోవెట్ సీడ్స్ వ్యాపార విభాగం కొత్తగా మూడు హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించింది. మొక్కజొన్నకు సంబంధించి జీఎంహెచ్ 6034, జీఎంహెచ్ 4110 రకాలు, వరికి సంబంధించి నవ్య రకం విత్తనాలు వీటిలో ఉన్నాయి. ముందుగా వీటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టగా రాబోయే నెలల్లో తెలంగాణ, బీహార్ మొదలైన రాష్ట్రాల్లోను క్రమంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ సీఈవో ఎన్‌కే రాజవేలు తెలిపారు.
తమకు పంట సంరక్షణ ఉత్పత్తులు కూడా ఉన్నందున నాట్ల దగ్గర్నుంచి కోతల వరకు అన్ని దశల్లో రైతులకు తాము వెన్నంటి ఉంటామని ఆయన పేర్కొన్నారు. విత్తన రంగంలో సొంత ఆర్‌అండ్‌డీ విభాగం ఉన్న అతి కొద్ది కంపెనీల్లో తమది ఒకటని, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను రైతులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాజవేలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment