Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్ 8) ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. కాగా నిన్నటి రోజున పసిడి ధరలు కొంత మేర క్షీణించాయి. ఈరోజు మరింత తగ్గుదల లేకపోయినప్పటికీ స్థిరంగా కొనసాగడం ఊరటగా చెప్పుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.71,000 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 77,450 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు చైన్నైలో మాత్రం 18 క్యారెట్ల పసిడి రేట్లలో తగ్గుదల నమోదైంది. ఈ బంగారం 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.58,150 వద్దకు దిగొచ్చింది. 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.71,100 వద్ద, రూ.77,450 దగ్గర ఉన్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.71,150, 24 క్యారెట్ల బంగారం రూ.77,600 వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి: ‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్
దిగొచ్చిన వెండి
Silver Price Today: దేశంలో ఎట్టకేలకు వెండి ధరలు కొండ దిగాయి. మూడు రోజుల క్రితం కేజీకి రూ.2000 పెరిగిన వెండి తర్వాత తగ్గుముఖం పట్టలేదు. ఈరోజు మాత్రం రూ.1000 తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,02,000 వద్దకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment