2023లో పరుగులు తీసిన బంగారం ధరలు కొత్త ఏడాది సైతం అదే జోరును కొనసాగిస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65 వేలు ఉండగా.. 2024లో రూ.70వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. దీంతో పాటు 10 గ్రాముల వెండి రూ.65 వేలు ఉండగా వచ్చే ఏడాది నాటికి అది కాస్త రూ.70 వేలకు చేరుకోవచ్చని అంచనా
ఇక ఈ ఏడాది చివరి రోజున నేడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే.
10 రోజుల తర్వాత దిగివచ్చని బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,470గా నమోదైంది.
ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,870గా కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 300 పెరిగి.. రూ. 78,600లుగా ఉంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,000గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment