
ముంబై : గతవారం భారీగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పుంజుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గతవారం 4.5 శాతం తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో పైకెగిశాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 306 రూపాయలు భారమై 52,533 రూపాయలకు పెరిగింది.
ఇక కిలో వెండి ఏకంగా 1729 రూపాయలు పెరిగి 68,900 రూపాయలు పలికింది. కాగా కరోనా వైరస్ విజృంభణ, అమెరికా-చైనా ట్రేడ్‌వార్, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 28.4 శాతం పెరిగాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల కదలికలను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : ఊరట : పసిడి నేలచూపులు