Gold Price Today: భారీగా ఎగిసిన బంగారం.. రూ.65 వేలకు చేరువలో.. | Gold, Silver Prices Today On 28 December 2023 | Sakshi
Sakshi News home page

Gold Price Today: భారీగా ఎగిసిన బంగారం.. రూ.65 వేలకు చేరువలో..

Dec 28 2023 12:24 PM | Updated on Dec 28 2023 12:37 PM

gold silver prices today 28 december 2023 - Sakshi

Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్‌ 28) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలు, దేశంలో ఉన్న బంగారం నిల్వల​కు అనుగుణంగా భారత్‌లో బంగారం ధరలు ఎగిశాయి. 

హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 58,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 430 పెరిగి రూ.64,250 లను తాకింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 58,900, రూ. 63,820 ఉండేవి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65వేలకు చేరువలో ఉంది. ఈ ఏకంగా రూ.490 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు రూ.450 పెరిగి రూ.59,450లకు చేరింది.

క్లిక్‌ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81, 000 లుగా ఉంది. ఇది నిన్నటి రోజు రూ.80,700 ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement