
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటెరో తాజాగా టోసిలిజుమాబ్ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. కోవిడ్–19 చికిత్సలో ఈ మందును వాడతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దల్లో స్టెరాయిడ్స్ పనిచేయని, ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తారు. బయోసిమిలర్ వర్షన్ టోసిలిజుమాబ్‌ను హెటెరో అనుబంధ కంపెనీ హెటెరో హెల్త్‌కేర్ టోసిరా పేరుతో విక్రయించనుంది. 20 మిల్లీలీటర్ల వయల్ రూపంలో కంపెనీ రూపొందించింది.
రోషె తయారీ యాక్టెమ్రా ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. హెటెరోకు చెందిన బయోలాజిక్స్ విభాగం హెటెరో బయోఫార్మా హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంటులో టోసిరాను ఉత్పత్తి చేస్తోంది. సెపె్టంబర్ చివరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ‘ప్రపంచవ్యాప్తంగా టోసిలిజుమాబ్ ఔషధం కొరతను పరిగణనలోకి తీసుకుంటే భార త్‌లో సరఫరా భద్రతకు డీసీజీఐ ఆమోదం చాలా కీలకం. నిష్పక్షపాతంగా ఔషధం పంపిణీకి ప్రభు త్వంతో కలిసి పని చేస్తాం. కంపెనీ సాంకేతిక సామర్థ్యానికి, కోవిడ్–19 ముఖ్యమైన ఔషధాలను తీసుకురావడానికి సంస్థకు ఉన్న నిబద్ధతకు తాజా అను మతి నిదర్శనం’ అని ఈ సందర్భంగా హెటెరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment