ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను పన్నుగా చెల్లిస్తున్నాడీ బిలియనీర్. నిన్న, నేటి గురించి కాకుండా రేపటి గురించి, భవిష్యత్తు టెక్నాలజీ గురించి నిరంతం ఆలోచించే ఈ ఎంట్రప్యూనర్ అనతి కాలంలోనే ప్రపంచం గుర్తించదగ్గ ధనవంతుడయ్యాడు. అంతేకాదు కేవలం నాలుగైదేళ్లలోనే భారీ వ్యాపార సామ్రాజ్యలను వెనక్కి నెట్టి తన కంపెనీని ముందుకు తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. అతనే ఎలన్‌మస్క్. తాజాగా ఇప్పుడు మరో రికార్డు నెలకొల్పేందుకు రెడీ అవుతున్నాడు.
పన్నుగా భారీ మొత్తం
ఈ ఏడాది తాను రికార్డు స్థాయిలో ట్యాక్స్ పే చేయబోతున్నట్టు ఎలన్ మస్క్ స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. అయితే ఆయన ట్యాక్స్‌గా చెల్లించబోయే మొత్తాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 11 బిలియన్ డాలర్ల సొమ్మును పన్నుగా ఎలన్‌మస్క్ చెల్లించబోతున్నాడు. ఇండియన్ కరెన్సీలో ఇది ఏకంగా రూ. 83,697 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత పన్ను చెల్లిస్తున్నాడంటే ఎలన్‌మస్క్ దగ్గర ఎంత సంపద ఉందంటే రమారమీ 335 బిలియన్ డాలర్లు. ఇటీవల ప్రపంచ కుబేరులు జెఫ్ బేజోస్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు ఎలన్‌మస్క్.
For those wondering, I will pay over $11 billion in taxes this year
— Elon Musk (@elonmusk) December 20, 2021
కొంచెం తగ్గింది
అమెరికా చట్ట సభల ప్రతినిధులు పన్ను చెల్లింపులపై చేస్తున్న కామెంట్లను నిరసిస్తూ గత నెలలో టెస్లా కంపెనీలో తన షేర్ల అమ్మకాలు చేశారు ఎలన్‌మస్క్. దీంతో ఆ కంపెనీ షేర్ల ధర కొద్ది మేర కోతకు గురైంది. లేదంటే ఎలన్‌మస్క్ చెల్లించాల్సిన పన్నులు మొత్తం లక్ష కోట్లు రూపాయలు దగ్గరగా ఉండేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment