ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టి హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్ మీద ఉంది. ప్రఖ్యాత కంపెనీలు నిరంతరం హైపర్ లూప్ ప్రయాణం అభివృద్ధిలో పడ్డాయి. వర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు అభివృద్ది పనులను చక చక చేపడుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్రయల్ దశలో ఉంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో సంచలనం క్రియేట్ చేసే అవకాశం ఉంది. హైస్పీడ్ రైల్ కంటే మూడు రెట్లు వేగంగా, సాదారణ రైలు కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించనుంది. హైపర్ లూప్ గరిష్ఠ వేగం గంటకు 1000 కిలోమీటర్లు.
ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త టెక్నాలజీ వాణిజ్య జెట్లకు ప్రయాణ సమయం పరంగా పోటీని ఇవ్వగలదని హైపర్ లూప్ పేర్కొంది. హైపర్ లూప్ పోర్టల్ లోని రూట్ ఎస్టిమేటర్ లో పేర్కొన్న విధంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1153 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరాన్ని 1 గంట 22 నిమిషాల్లో కవర్ చేయవచ్చని పేర్కొంది. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు)
దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వర్జిన్ హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీని మరింత ఉపయోగిస్తాయి. వర్జిన్ హైపర్ లూప్ వ్యవస్థ వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment