
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు, వెంటాడుతున్న కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి.
ఉదయం పదిన్నర గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 13.43 పాయింట్ల నష్టపోయి 61,136.61 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ మాత్రం 3.85 పాయింట్ల లాభంతో 18,216.20 వద్ద కొనసాగుతోంది. లాభనష్టాల్లోనివి.. సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
(చదవండి: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!)