
U.S. Inflation Rate: ప్రపంచంలోని పలు దేశాల తరహాలోనే అమెరికా కూడా వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. మే నెల్లో వినియోగ ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదయ్యింది. గడచిన 40 సంవత్సరాల్లో (1982 తర్వాత) ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. గ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు మే నెల్లో భారీగా పెరిగాయి. ఏప్రిల్‌తో పోల్చితే ద్రవ్యోల్బణం ఒక శాతం పెరిగినట్లు కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే ఫెడ్ ఫండ్ వడ్డీరేట్ల పెంపు పక్రియ, వినియోగ వ్యయం తయారీ వస్తువుల నుంచి సేవల్లోకి మారడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికి ద్రవ్యోల్బణం 7 శాతానికి దిగిరావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎకానమీ మాంద్యంలోకి జారకుండా జాగ్రత్తపడుతూ, వ్యయాల తగ్గింపు–వృద్ధి పెంపు లక్ష్యంగా రేట్ల విధానం కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ భావిస్తోంది.
చదవండి: రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్? వాళ్లను నిండా ముంచడమే లక్ష్యంగా..!