మరోమైలు రాయిని చేరిన ఎల్‌ఐసీ | LIC has launched a new centralized web based work | Sakshi
Sakshi News home page

మరోమైలు రాయిని చేరిన ఎల్‌ఐసీ

Published Thu, Jun 24 2021 7:34 AM | Last Updated on Thu, Jun 24 2021 7:34 AM

  LIC has launched a new centralized web based work - Sakshi

హైదరాబాద్‌: బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ మరో మైలురాయిని చేరుకుంది. నూతనంగా రూపొందించిన కేంద్రీకృత ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ–పీజీఎస్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ ముంబైలోని కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఎండీ విపిన్‌ ఆనంద్‌ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ప్లాట్‌ఫామ్‌ నుంచి జారీ అయిన మొదటి రసీదును ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేవశ్‌ శర్మకు ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ అందించారు. కేంద్రకృత వసూళ్లు, చెల్లింపుల కోసం ఈ నూతన ప్లాట్‌ఫామ్‌ను ఎల్‌ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.   

చదవండి: ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement