
మీరు మారుతి సుజుకి కారు కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం తన వినియోగదారుల కోసం మరో కొత్త సేవలను అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి మారుతి సుజుకి కార్లకు చెందిన యాక్ససరీలు లేదా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మారుతి సుజుకి ఒక పత్రికా ప్రకటనలో.. తమ సంస్థకు చెందిన జెన్యూన్ యాక్ససరీలు ఇప్పుడు దేశంలోని 100 నగరాల్లో గల వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చని పేర్కొంది. కస్టమర్ సౌలభ్యం కోసం హోమ్ ఇన్ స్టలేషన్ షెడ్యూల్ చేసే ఆప్షన్ కూడా ఇప్పుడు ఉంది.
ప్రస్తుతం, ఆన్‌లైన్‌లో సుమారు 2,000కి పైగా యాక్ససరీలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ కామర్స్ ఫ్లాట్ ఫారాల వేదికగా ఎలాగైతే వస్తువులను కొనుగోలు చేస్తున్నామో, అలాగే మారుతి కస్టమర్లు వెబ్ సైట్ ద్వారా యాక్ససరీలను బ్రౌజ్ చేయడంతో పాటు తమకు కావాల్సిన వాటిని ఎంచుకొని చెల్లింపులు చేసే అవకాశం ఉంది. జెన్యూన్ యాక్ససరీలను వినియోగదారులకు అందించడం కోసమే ఈ సేవలు ప్రవేశ పెట్టినట్లు సంస్థ పేర్కొంది. "ఆన్‌లైన్‌లో మారుతి సుజుకి జెన్యూన్ యాక్ససరీస్ లభించడం వల్ల వినియోగదారులకు మరింత చేరువ అయ్యే అవకాశం ఉంటుందని" మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి అయుకావా చెప్పారు. ఆన్‌లైన్‌లో మారుతి సుజుకి జెన్యూన్ యాక్ససరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(చదవండి: వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది?)
Comments
Please login to add a commentAdd a comment