హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో మైబాహ్ ఎస్–క్లాస్ మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర ఎక్స్‌షోరూంలో మైబాహ్ ఎస్–క్లాస్ 580 4మేటిక్ రూ.2.5 కోట్ల నుంచి, మైబాహ్ ఎస్–క్లాస్ 680 4మేటిక్ రూ.3.2 కోట్ల నుంచి ప్రారంభం. ఈ కారు లగ్జరీ, టెక్నాలజీ సమ్మేళనమని కంపెనీ ప్రకటించింది.
గ్యాసోలిన్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఏర్పాటు ఉంది. 8 సిలిండర్ పెట్రోల్ ఇంజన్, ఇంటిగ్రేటెడ్ సెకండ్ జనరేషన్ స్టార్టర్ ఆల్టర్నేటర్, 48 వోల్ట్ ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌తో 580 4మేటిక్ తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. 680 4మేటిక్ ట్రిమ్‌ను ఆల్‌వీల్ డ్రైవ్‌తో వీ12 ఇంజన్‌ను పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment