
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో సానుకూల అంశాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 488 పాయింట్లు లాభంతో 59386 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17472 వద్ద కొనసాగుతుంది.
అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకోవడంతో ఈ గ్రూప్ షేర్లలో మూడోరోజూ ర్యాలీ కొనసాగింది. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్,రిలయన్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్ టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో దివిస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్,సన్ ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అదానీ షేర్లలో ర్యాలీ
అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకుంది. గ్రూప్ షేర్లలో మూడోరోజూ ర్యాలీ కొనసాగింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ పోర్ట్స్ 3.5%, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 3%, ఏసీసీ సిమెంట్స్ ఒకటిన్నర శాతం పెరిగాయి. గత రెండురోజుల్లో రూ.70,302 కోట్ల సంపద సృష్టి జరపడంతో గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది.