
అనంత్ అంబానీ-రాధికామర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రివెడ్డింగ్ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్‌ను అనంత్ ఈ ఏడాది జులైలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది.
గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిపారు. ఈ ప్రీ వెడ్డింగ్ సంబరాలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని బిలియనీర్స్ తరలివచ్చారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా?
అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. రాధిక మర్చంట్‌ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH | Founder and chairperson of Reliance Foundation Nita Ambani performed at Anant Ambani-Radhika Merchant's pre-wedding celebrations in Jamnagar, Gujarat. pic.twitter.com/7XvDzbr7Qa
— ANI (@ANI) March 3, 2024