
భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఉచితంగా పేటిఎమ్ సౌండ్‌బాక్స్ సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం ఫర్ బిజినెస్(పీ4బి) యాప్‌ను ద్వారా 40% తగ్గింపుతో రూ.299కు లభిస్తున్న పేటీఎం సౌండ్‌బాక్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారులు పేటిఎమ్ ద్వారా ఒక నెలలో 50 కంటే ఎక్కువ లావాదేవీల చేస్తే వ్యాపారులు ప్రతి నెలా 60 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇలా మీరు గనుక ఐదు నెలల పాటు 50 కంటే ఎక్కువ లావాదేవీలు పేటీఎం ద్వారా చేస్తే మీకు 300 రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఇలా మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు.
ఈ ఆఫర్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేసే విధంగా ప్రోత్సహించినట్లు అవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు అందుబాటులో ఉంది. వ్యాపారులలో పేటిఎమ్ సౌండ్‌బాక్స్ అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. నకిలీ స్క్రీన్‌లు, తప్పుడు నిర్ధారణలను చూపించే కస్టమర్లచే మోసపోకుండా వారిని కాపాడుతుంది. ఈ పరికరం అనేక ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇది వారి మాతృభాషలో లావాదేవీ నిర్ధారణను పొందడానికి సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment