
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు రానున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అభిప్రాయపడ్డారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గురువారం ఓ టీవీ చానెల్ ఇంటర్యూలో మాట్లాడుతూ.. దేశంలో లౌకికత్వం, నిర్మాణాత్మక చర్యల వల్ల స్టాక్ మార్కెట్ వేగంగా పుంజుకుంటుందని తెలిపారు. దేశ వృద్ధి రేటు చూసి ప్రజలే ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు.
కరోనాతో మార్కెట్లు కుదేలవుతాయనే విశ్లేషణలు అర్థరహితమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ప్రజలు దీటుగా ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల నుంచీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్‌గా కొనసాగుతూ బిగ్‌బుల్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా.. భవిష్యత్తులో పెట్టుబడికి దేశీ స్టాక్ మార్కెట్లు అత్యుత్తం అంటూ ఇటీవల కితాబిచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: వయసు 60- సంపద రూ. 16000 కోట్లు)