
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలిపిన ఒక ప్రకటనలో రిజర్వ్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డుల జారీపై విధించిన నిషేదాన్ని సడలించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఆంక్షలు తొలిగిపోవడంతో దూకుడుగా తిరిగి మార్కెట్లోకి వస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రెడిట్ కార్డుల జారీ విషయంలో మేము దూకుడుగా తిరిగి వచ్చేందుకు అన్ని సన్నాహాలు, వ్యూహాలు రాబోయే కాలంలో అమలు చేయనున్నట్లు" హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ముందున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ గత ఏడాది నిషేధం విధించింది. అయితే, దీనివల్ల బ్యాంకు ఖాతాదారులపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. డిజిటల్ బిజినెస్ జనరేటింగ్ యాక్టివిటీస్ సంబంధించి ఆర్‌బీఐ తదుపరి సమీక్ష వరకు ఆంక్షలు కొనసాగుతాయని బ్యాంకు పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త కార్డ్స్ జారీపై నిషేధం విధించడంతో బ్యాంకుపై భారీగానే దెబ్బపడింది. దాని కార్డ్ బేస్ గత ఏడాది డిసెంబర్ నెలలో 15.38 మిలియన్ల నుంచి జూన్ నాటికి 14.82 మిలియన్లకు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకుగా నిలిచింది.
Media Statement by @HDFC_Bank.@RBI @FinMinIndia pic.twitter.com/joWEyZwqwv
— HDFC Bank News (@HDFCBankNews) August 18, 2021