
ముంబై: పేమెంట్ వ్యవస్థల వినియోగంపై ఫీజులు, చార్జీల గురించి అభిప్రాయాలను తెలపాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరుతోంది. ఇందుకోసం నిర్దిష్టంగా 40 ప్రశ్నలను రూపొందించింది. అక్టోబర్ 3లోగా వీటికి సమాధానాలు పంపించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్), నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మొదలైన చెల్లింపుల విధానాలు ఉన్నాయి.
వీటిని నిర్వహిస్తున్నందుకు గాను ఆయా సంస్థలకు ఆర్థికంగా కొంత లబ్ధి చేకూర్చేందుకు అలాగే ప్రజలు చౌకగా వీటిని వినియోగించుకోగలిగేందుకు చార్జీలు సహేతుకంగా ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment