
రిలయన్స్ జియో 51వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జియో తన కార్యాలయాల్లో సంస్థ ఉద్యోగులు కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో మార్చి4 నుండి 10వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏడాది పొడవునా సురక్షితంగా పని చేయాలనే నిబద్ధతను పునరుద్ధరించడం, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలను జరుపుతున్నట్లు చెప్పారు.
సేఫ్టీ వీక్‌లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పని ప్రదేశాలలో వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యకలాపాలలో కార్మికులకు నిర్మాణ సామగ్రి, యంత్రాలు, పరికరాలను సురక్షితంగా నిర్వహించడంపై ప్రత్యేక ప్రదర్శన సెషన్‌లు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జియో బృందం సభ్యులు పని ప్రదేశాలలో ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లపై అవగాహన, నిబద్ధతను పెంచేలా ప్రతిజ్ఞ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment