ముంబై: డేటా/సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్స్ (రక్షణ వ్యవస్థలు)ను మరింత బలోపేతం చేసుకోవాలని, సైబర్ మోసాల నుంచి తమ కస్టమర్లకు రక్షణ కల్పించాలని బ్రోకింగ్ కంపెనీలను సెబీ కోరింది. మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది. శుక్రవారం ముంబైలో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (యాన్మి) సమావేశాన్ని ఉద్దేశించి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీపీ గార్గ్ మాట్లాడుతూ.. కస్టమర్లకు అనుకూలమైన, సురక్షిత టెక్నాలజీల అభివృద్ధికి సెబీ ఏర్పాటు చేసిన శాండ్‌బాక్స్ నుంచి ప్రయోజనం పొందాలని బ్రోకర్లను కోరారు.
కరోనా మహమ్మారితో నిత్యజీవితంలో చాలా వరకు కార్యకలాపాలు డిజిటల్‌కు వేగంగా మళ్లినట్టు జీపీ గార్గ్ చెప్పారు. టెక్నాలజీ తెలిసిన ఇన్వెస్టర్లే కాకుండా.. సాధారణ పౌరులు సైతం వినియోగించుకునే విధంగా సాంకేతిక పరిష్కారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. యామ్ని సర్వే వివరాలను ఈ సందర్భంగా గార్గ్ విడుదల చేశారు. కరోనా వచ్చిన తర్వాత స్టాక్ బ్రోకర్లలో 92.6 శాతం మంది టెక్నాలజీపై మరింత నిధులను వెచ్చించినట్టు ఈ సర్వే గుర్తించింది. 41 శాతం మంది బ్రోకర్లు ఈ వ్యయాలు 20 శాతానికి పైనే పెరిగినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment