సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిసాయి. రోజంతా లాభనష్టాలమధ్య ఊగిసలాడిన సూచీలుచివరికి మద్దతు స్థాయిలకు దిగువన ముగిసిన మరింత బలహీన సంకేతాలందించాయి. ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్నప్పటికీ మిడ్ సెషన్ తరువాత లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో సెన్సెక్స్ 202 పాయింట్లు పతనమ 47878 వదంద, నిఫ్టీ 65 పాయింట్లు క్షీణించి 14341 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గత 11 నెలల్లో తొలిసారి మార్కెట్ వరుసగా 3 వారాలు నష్టాల్లో ముగిసింది.
పవర్ గ్రీడ్, ఎన్‌టీపీసీ, యాక్సిస్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్ స్టాక్ దాదాపు 3 శాతం కుప్పకూలింది. ఇంకా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, విప్రో, మహీంద్రా & మహీంద్రా, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, గ్రాసిమ్ , ఇన్ఫోసిస్ కూడా 1-3 శాతం మధ్య పడిపోయాయి.
ప్రధాన నగరాల నుండి టైర్ -2, టైర్-3 పట్టణాల్లో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో లాక్‌డౌన్ మనముందున్న ఏకైక పరిష్కారంగా కనిపిస్తోందని విశ్లేషకుడు ఎస్ కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు. రాయిటర్స్‌తో మాట్లాడిన ఆయన భవిష్యత్ ఆదాయాలపై సెకండ్ వేవ్ ప్రభావం భయాలతో మార్కెట్లో అనిశ్చితి నెలకొందని చెప్పారు.గత 24 గంటల్లో భారతదేశంలో కరోనా కేసులు 3,32,730 గా నమోదుకాగా, 2,263 మంది మరణించారు.
చదవండి : ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment