
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు తిరగి కోలుకున్న కూడా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు దారుణంగా 1 శాతం మేర పడిపోయాయి. విద్యుత్తు రంగం షేర్లు రాణించాయి. ముగింపులో, సెన్సెక్స్ 104.67 పాయింట్లు(0.18%) క్షీణించి 57,892.01 వద్ద ఉంటే, నిఫ్టీ 17.60 పాయింట్లు(0.10%) నష్టపోయి 17,304.60 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు రాణిస్తే.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోతే, పవర్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడింది. ఇక బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ప్రతికూలంగా ట్రేడయ్యాయి.
(చదవండి: అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment