Elon Musk Propose Selling My Tesla Stock on Twitter Poll: స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన ట్వీట్‌తో చర్చాంశనీయంగా మారారు. నా దగ్గర డబ్బులు లేవు. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు' అంటూ ట్వీట్‌లో నెటిజన్‌ల అభిప్రాయాన్ని కోరారు. అందుకు 54శాతం నెటిజన్లు అవునని 876,189 ఓటింగ్ వేశారు.
Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock.
— Elon Musk (@elonmusk) November 6, 2021
Do you support this?
ఇటీవల వాషింగ్టన్‌లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. దీంతో ఎలన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా కంపెనీ స్టాక్స్‌లో 10 శాతం విక్రయించాలా' అంటూ ట్వీట్ చేశారు.
కొంతమంది డెమోక్రాట్లు బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు, వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్‌లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా?అని ఎలన్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన రెండుగంటల్లోపే మొత్తం 876,189మంది ఓటింగ్ ద్వారా అవనని సమాధానం ఇచ్చారు. మస్క్ సంపదన ఎక్కువ భాగం టెస్లా షేర్లలో ఉంది. అందుకే నా వద్ద స్టాక్ మాత్రమే ఉంది, కాబట్టి నేను వ్యక్తిగతంగా పన్నులు చెల్లించడానికి ఏకైక మార్గం స్టాక్ విక్రయించడం" అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment